Bath Mistakes: మనలో చాలా మంది వేడినీటితోనే స్నానం చేస్తారు. చలికాలం మాత్రమే కాదు.. వేసవిలో కూడా గోరువెచ్చని నీరు ఉంటేనే స్నానం చేసుకుంటారు. కేవలం గోరు వెచ్చని నీరే కాదు.. సలసల కాగే నీరు ఉంటేనే కొందరికి స్నానం చేసిన ఫీలింగ్ ఉంటుంది.. కానీ వేడి నీటి కన్నా చన్నీటితో స్నానం చేస్తేనే ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా?
పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అని తేడా లేకుండా చాలా మంది స్నానం చేసేటప్పుడు ఎక్కువ సేపు సబ్బును శరీరంపై అప్లై చేస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సబ్బులో ఉండే రసాయనాలు మొటిమలను మాత్రమే కాకుండా, చర్మాన్ని పొడిగా కూడా చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో సబ్బును పరిమిత పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు.