Sai Teja: తమిళనాడులో (Tamilnadu) ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన (Army Helicopter Crash) ఘటనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసి సాయి తేజా మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా విషాద చాయలు అలముకున్నాయి. కనీసం బాడీ గుర్తు పట్టలేనంతగా మారింది. చిత్తూరు జిల్లా కురబలకోట ఎగువ రేగడ గ్రామానికి చెందిన జవాన్ సాయి తేజ సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేస్తు ప్రమాదంలో తుది శ్వాస విడిచారు. ఆర్మీలో చేరిన అతి కొద్ది కాలంలోనే ఎంతో గుర్తింపు దక్కింది. అందుకే సీడీఎస్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో సభ్యుడయ్యారు. అంతేకాదు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు.
ఒకరంగా చెప్పాలంటే బిపిన్ రావత్ ఎక్కడ కు వెళ్లినా.. అతడి ధైర్యం సాయి తేజనే అనడం అతి శయోక్తి కాదు.. ఎన్నోసార్లు కీలక సమయాల్లో రావత్ కు అడ్డుగోడల నిలబడ్డాడు మన సాయి తేజ.. సాయి తేజలో ఉన్న ధైర్య సహసాలను ముందే రావత్ గుర్తించగలిగారు. 2013లో బెంగళూరు రెజిమెంట్ నుంచి ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు సాయి తేజ. సిపాయిగా పనిచేస్తూనే ఏడాది తర్వాత పారా కమాండో పరీక్షరాసి ఉత్తీర్ణుడయ్యారు. అతి కొద్ది కాలానికే 11వ పారాలో లాన్స్ నాయక్ హోదా దక్కింది. అక్కడ అతని పని తీరుకు ఉన్నతాధికారుల నుంచి పలు ప్రశంసలు దక్కాయి.
మొదటి నుంచి సాయితేజ ఆర్మీలో కొనసాగడంపై అతడి తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందేవారు. చాలాసార్లు మధ్యలో మనేయాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయంట.. ఈ విషయంపై సాయితేజతో నాలుగైదు సార్ల మాట్లాడినట్లు అతడి తండ్రి మోహన్ చెప్పారు. తనతో పాటు తమ్ముడినీ ఆర్మీకి తీసుకెళ్లాడని.. పదోన్నతులు తెచ్చుకున్నాడని.. ఇక్కడ వరకు అంతా బాగనే ఉంది కదా.. ఇక చాలు ఇంటికి వచ్చేయ్ అని సాయి తేజను తల్లిదండ్రులు కోరారు అంట.. ప్రాణాల మీదకు వచ్చే ఉద్యోగం మనకొద్దు.. మానుకో’ అంటూ తండ్రి మోహన్ చెప్పేవారంట..
అదే సమయంలో సాయి తేజపై తల్లిదతండ్రుల ఒత్తిడితో ఆర్మీ నుంచి వైదొలుగాలని నిర్ణయానికి వచ్చాడని.. ఆలోచన వచ్చిన వెంటనే విషయాన్ని బిపిన్ రావత్ కు చెబితే.. ఆయన ‘నేను ఉన్నంతవరకూ నువ్వూ ఉండు సాయీ’ అని రావత్ చెప్పారంటే.. అంత మాట అన్నారు అంటే రావత్ సాయిని ఎంతగా నమ్మారో అర్థం చేసుకోండి అంటూ తండ్రి మోహన్ నాటి గుర్తును నెమరవేసుకున్నారు.