Vegetable Price: 50 పైసలకే కిలో కూరగాయలు.. మరీ అంత చౌకగానా..? రైతు కష్టానికి విలువ అంతేనా..?
Vegetable Price: 50 పైసలకే కిలో కూరగాయలు.. మరీ అంత చౌకగానా..? రైతు కష్టానికి విలువ అంతేనా..?
Andhra Pradesh: ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఏం కొందామన్నా రూ.20 చెల్లించాల్సిందే. అందునా శ్రావణమాసం వస్తే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటాయి. కానీ ఈ జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది..
సాధారణంగా రైతు బజారుకు గానీ, కూరగాయల మార్కెట్ గానీ వెళ్తే.. ఏ కూరగాయ కొందామన్నా కిలో కనీసం రూ.10 నుంచి రూ.50 వరకు పలుకుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) (Imgae credit : shutterstock)
2/ 7
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఏం కొందామన్నా రూ.20 చెల్లించాల్సిందే. అందునా శ్రావణమాసం వస్తే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుంటాయి. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
కానీ ఆ జిల్లాలో మాత్రం కూరగాయల రేట్లు అశ్చర్య పరుస్తున్నాయి. మార్కెట్ ధరకు అక్కడ పలుకుతున్న ధరకు అసలు పొంతనే ఉండటం లేదు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
కర్నూలు జిల్లా ఆలూరులో కూరగాయలు పండిస్తున్న కూరగాయల ధరలు రూపాయల నుంచి పైసలకు పడిపోయాయి. అక్కడ కిలో కూరగాయలు మరీ దారుణంగా 50 పైసలు పలుకుతున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
కిలో వంకాయలు అర్ధరూపాయి, బీరకాయలు కూడా అదే రేటు పలుకుతున్నాయి. టమోటాలు, పచ్చిమిర్చి కూడా కిలో కేవలం రూ.2 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, దూరప్రాంతానికి తరలించాలంటే రవాణా ఖర్చులు ఎక్కువవుతుండటంతో ఇక్కడి దళారులు రైతులను దోచుకుంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
ఆలూరులో రైతులు భారీగా కూరగాయలు పండించడంతో సప్లై పెరగడం వల్ల ధరలు తగ్గినట్లు కూడా చెబుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)