ఈనెల 18న మహా శివరాత్రి జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని నడపనుంది, మహా శివరాత్రి సందర్బంగా శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులను TSRTC ఏర్పాటు చేసింది. ఈ నెల 16 నుంచి 19 వరకు ఈ బస్సులను నడపనుంది. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, తదితర ప్రాంతాల నుంచి ఈ సర్వీస్లు నడుస్తాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ని సందర్శించగలరు.