సోషల్ మీడియాలో పేర్లు మార్చి ఎకౌంట్లు క్రియేట్ చేసుకోవడం.. అమ్మాయిలతో చాటింగ్ చేసి వారి పర్సనల్ ఫోటోలు సేకరించి బెదిరింపులకు దిగడం వంటివి చేసేవాడు. చివరకి ఓ యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి వెళ్లాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా సోషల్ మీడియాలో అమ్మాయిలతో కనెక్ట్ అయి కన్నింగ్ ఐడియాను అమలు చేశాడు. (ప్రతీకాత్మకచిత్రం)
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తి గ్రామానికి చెందిన అన్వేష్ అనే యువకుడు అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చదువును పక్కనబెట్టేశాడు. చేతిలో స్మార్ట్ ఫోన్, నెట్ ఉండటంతో అందమైన యువతులను లైన్లో పెట్టాడు. ప్రమ పేరుతో తన ముగ్గులోకి దించుకున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)
ఐతే అతడి ప్రపోజల్ ను యువతి తిరస్కరించింది. దీంతో అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అలా ఆ యువతి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అతడి వేధింపులు భరించలేక యువతి తల్లిదండ్రులతో చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకుడ్ని అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)