ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. ప్రతి రోజు 11 వేలకుపైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన పెంచుతోంది. మరోవైపు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి బయటకు వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు ఆంక్షలు తప్పడం లేదు. ఇప్పటి వరకు బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకున్నా.. ఇతర రాష్ట్రాలు మాత్రం బాబోయ్ ఏపీ నుంచి.. రానే రావొద్దు అంటున్నాయి.
ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఊహించని స్థాయిలో ప్రతి రోజే వేయికిపైగా మంది కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల బోర్డర్ లలో పరిస్థితి దారుణంగా ఉంది. చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్లాలి అనుకునే వారికి.. శ్రీకాకుళంలో నుంచి ఒడిషా వెళ్లాలి అనుకునే వారికి కష్టాలు తప్పడం లేదు.
బోర్డర్ దాటి తమ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే తప్పక థర్మల్ స్క్రీనింగ్ కు ఒఫ్పుకోవాలని కండిషన్ పెడుతున్నాయి. అందుకు నో చెప్పే వారిని వెనక్కు పంపించేస్తున్నాయి. దాంతో పాటు కరోనా లేదనే నెగిటివ్ రిపోర్ట్ కూడా చూపెట్టాలని బోర్డర్ దగ్గర పోలీసులు నిలదీస్తున్నారని ఏపీ బోర్డర్ వాసులు ఆందోళన చెందుతున్నారు.