ఐతే మొబైల్ వినియోగం పరిమితంగా ఉంటే ఎలాంటి నష్టమూ లేదు. అదే స్క్రీన్ కు అతుక్కుపోతే మాత్రం ప్రాణాలమీదకు రావడం ఖాయం. ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసుల హవా నడుస్తుండటంతో పిల్లలు వీడియో గేమ్స్ కు అలవాటు పడుతున్నారు. గేమ్స్ తోనే నిత్యం గడిపేస్తున్నారు. అలా గేమ్స్ కు అలవాటు పడిన ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెదకడుబూరుకు చెందిన ఓ 8వ తరగతి విద్యార్థి తరచూ మొబైల్ గేమ్స్ ఆడుతుంటాడు. ఓ మూడు నెలల నుంచి పూర్తిగా మొబైల్ గేమ్ కు బానిసయ్యాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కళ్లుతిరిగి పడిపోయాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. కర్నూలు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. (ప్రతీకాత్మకచిత్రం)
కర్నూలు ఆస్పత్రి డాక్టర్లు చికిత్స అందించడంతో స్పృహలోకి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోయాడు. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. నిత్యం మొబైల్ గేమ్స్ ఆడుతుండటం వల్ల మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయని.. అందుకే ఇలా జరిగినట్లు డాక్టర్లు తేల్చారు. విద్యార్థి కోలుకోవడానికి మరికొంత కాలం పడుతుందని తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
పిల్లలు మొబైల్ కు బానిసైతే వారిపై మానసికంగా ప్రభావం చూపడంతో పాటు కళ్లు, మెదడుపై తీవ్రప్రభావం చూపుతుంటాయని చెబుతున్నారు. అలాగే టీనేజ్ పిల్లలు పోర్న్ సైట్లకు బానిసలయ్యే ప్రమాదముందని కూడా హెచ్చరిస్తున్నారు. మొబల్ వాడుతున్న పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి సూచిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)