Andhra Pradesh: పెళ్లిలో 50 మందికే పరిమితి? జిమ్‌లు క్లోజ్, థియేటర్లలో 50% సీట్లకే అనుమతి? ఏపీలో ఇక కఠిన ఆంక్షలు

ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. కొత్త గైడ్ లైన్స్ రూపొందించింది. జిమ్ములు, స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని నిర్ణయించింది. అలాగే థియేటర్లు, ప్రజా రవాణా విషయంలోనే 50 శాతం వరకే అనుమతిచ్చింది.