KOIL ALWAR THIRUMANJANAM SEVA IN TIRUMALA TIRUPATI DEVASTHANAM SB
Pics: చంద్రగ్రహణంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శుధ్ధి కార్యక్రమం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం నుంచి బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.
3/ 9
ఆలయంలోని ఆనందనిలయం నుంచి బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారన్నారు.
4/ 9
శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం శుధ్ది చేస్తున్న అర్చకులు.
5/ 9
ఈ కార్యక్రమంలో తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, పేష్కర్ శ్రీ లోకనాథం, ఆలయ ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
6/ 9
గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
7/ 9
శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేశారు.
8/ 9
ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించింది.
9/ 9
శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.