Kanipakam Temple | కాణిపాకం‌లో బ్రహ్మోత్సవాలు..చిలుక వాహనంపై గణపయ్య

Kanipakam Temple - చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆరో రోజైన గురువారం గణపయ్య చిలుక వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు.