Anna Raghu, Amaravathi , News18.. Andhra Pradesh Politics: సీఎం జగన్ ఇలాకా.. కడపలో ఏం జరుగుతోంది.. సాధారణంగా కడప అంటే వైసీపీ అడ్డా అనే చెప్పాలి. ఇతర పార్టీలకు ఈ మధ్య కాలంలో అంత ఆదరణ కనిపించడం లేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సైతం.. ఆయన టూర్లకు అక్కడ అంతంతే రెస్పాన్స్ ఉండేది.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతోంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఉడేంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు కడప పర్యటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని పెంచింది.
తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఊహించని విధంగా ప్రజా స్పందన కనిపించింది. కడపలో చంద్రబాబు వెళ్లిన ప్రతి చోటా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇది సైతం ప్రతిపక్షానికి ఆయుధంలా దొరికింది. సీఎం జగన్ సొంత అడ్డాలోనే ప్రభుత్వ వ్యతిరేేకత ఎంత ఉందో అర్థమవుతోందని.. చంద్రబాబు టూర్ ను ఉదహరణగా టీడీపీ నేతలు చెబుతున్నారు.
కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంలో భారీ స్థాయి కార్యకర్తలు పాల్గొని ఎన్నడూ లేని విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చెన్నూరు, దుంపలగట్టు, ఖాజీపేట, కమలాపురం, శివారుల్లో బ్రహ్మరథం పట్టారు. మహిళలు నీరాజనం పడితే క్రేన్ ద్వారా పూల మాలలు వేశారు. సీఎం సొంత జిల్లాలో అశేష జనవాహిని నడుమ చంద్రబాబు నాయుడు రోడ్ షో., బహిరంగ సభలు జరిగాయి.
రాజారెడ్డి కాలం నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులు ప్రతిరిత్యం వహిస్తున్న పార్టీలకు తప్ప వేరొక పార్టీ నాయకుల సభలో జనాలు వచ్చే వారు కారు. మద్యం., బిరియని., డబ్బులు ఇస్తామన్న జనాలు వచ్చేది మాత్రం అంతంతమాత్రంగానే వుంటుంది. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి నేటి వరకు కడపకు వచ్చిన సమయంలో ఇంతటి జనసందోహన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సీఎం ఇలాకాలో ఎవరు వచ్చిన జనాలు రారని.. భావించిన అధికార పార్టీ నేతలు చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వచ్చిన జనాదరణ చూసి లోకల్ టీడీపీ నాయకులలో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సభలను పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అంతమంది జనం రావడంతో అధికార పార్టీలో అలజడి మొదలైంది.
చంద్రబాబు తాజా పర్యటన అధికార వైసీపీలో భయం పుట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఊహించని విధంగా జనవాహిని రావడంతో కడప వైసీపీ నేతల్లో టీడీపీ భయం కొత్తగా పట్టుకుంది అంటున్నారు. ఇన్నాళ్లు ఏమి కాదు...ఎవరు ఏమి చేయలేరు అని ధీమాగా ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.