జనసేన అధినేత పవన్ కల్యాణ్, జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ ట్విట్టర్, వైఎస్ జగన్ పై పవన్ కల్యాణ్ ఫైర్, పవన్ కల్యాణ్ న్యూస్, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్" width="1600" height="1600" /> Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనసేన అధినేత మూడో అస్త్రాన్ని సిద్ధం చేశారు. మొదట వెళ్లి నేరుగా ఉక్కు ఉద్యమ కారులకు సంఘీభావం తెలిపిన ఆయన.. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శులు చేసి.. రెండు వారాల డెడ్ లైన్ పెట్టారు.. వెంటనే ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి.. కేంద్రం దగ్గరకు తీసుకెళ్లాలని.. లేదంటే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇక మూడో అస్త్రంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. తన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉక్కుపరిశ్రమ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి తన మద్దతు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విశాఖ ఉక్కు పరిరక్షణకై ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు.
విశాఖలోని ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. జనసేనాని మంగళగిరిలో ఇప్పటికే ఒక్కరోజు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకుని వెళ్ళమని మళ్ళీ సూచించారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో జనసేన అధినేత ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఇలా డిజిటల్ పోరాటం ప్రారంభించారు.