బడికి పంపే పిల్లల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని వాస్తవానికి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా స్కూళ్లు తెరవకపోవడంతో అది అక్టోబర్‌కు వాయిదా పడింది.