ISRO: ఇస్రో మరో సూపర్ సక్సెస్.. PSLV C53 ప్రయోగం విజయంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
ISRO: ఇస్రో మరో సూపర్ సక్సెస్.. PSLV C53 ప్రయోగం విజయంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
ISRO: భారత అంతరిక్ష ప్రయాణంలో మరో ఘన విజయం సొంతం చేసుకుంది. కమర్షియల్ శాటిలైట్స్‌ను నింగిలోకి పంపడంలో ఇటీవల ఇస్రో అగ్రదేశాలకు పోటీ ఇస్తోంది. తాజాగా ఇస్రో (ISRO) ఇంకో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. సింగపూర్ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపింది. దీంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? .
ISRO: భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక విజయం ఇస్రో (ISRO) సొంతమైంది. శాస్త్రవేత్తల అంచనాలను నిలబెడుతూ.. యావత్ భారత దేశం తలెత్తుకునేలా నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం అనుకున్నట్టే చాలా విజయవంతమైంది.
2/ 9
సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి అనుకున్న సమయానికి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం , 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించారు.
3/ 9
పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో వాణిజ్యపరమైన రెండో మిషన్ ఇది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో తేలిపోయారు.
4/ 9
మొత్తానికి కమర్షియల్ శాటిలైట్స్‌ను నింగిలోకి పంపడంలో అగ్రగామిగా కొనసాగుతోన్న ఇస్రో (ISRO) అదే గుర్తింపును కొనసాగించగలిగింది. తాజా ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో తనకెదురు లేదని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
5/ 9
‘నెల్లూరు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ C-53ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది ఇస్రో. 25గంటల కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే నింగిలోకి దూసుకుపోయింది రాకెట్. నాలుగు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది’ అని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు.
6/ 9
అయితే సింగపూర్‌తో కుదుర్చుకున్న కమర్షియల్ డీల్ ప్రకారం పీఎస్ఎల్వీ C-53 ప్రయోగం సక్సెస్ తో మరోసారి ప్రపంచ దేశాల చూపు మన శాస్తవేత్తలపై పడింది. మొత్తం మూడు శాటిలైట్స్‌ను కక్ష్యలోకి విజయవంతంగా భారత్ ప్రవేశ పెట్టగలిగింది.
7/ 9
సింగపూర్ అవసరాల కోసం తయారు చేసిన ఈ శాటిలైట్స్‌లో ఒకదాన్ని భూపరిశీలన కోసం వినియోగించనున్నారు. ఇది, డీఎస్ఈవో టెక్నాలజీతో పనిచేయనుంది. మొత్తానికి కమర్షియల్ శాటిలైట్స్ ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఇస్రో కొనసాగుతోంది.
8/ 9
ఇప్పటివరకు 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. 2016లో అయితే ఒకేసారి 104 శాటిలైట్స్‌ను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేపడుతుండటంతో భారత్‌ను, ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి పలు దేశాలు.
9/ 9
ఇకపీఎస్ఎల్వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.