నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ స్పేస్ సెంటర్ వేదికగా ఈ నెల 14న పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబందించి ఇవాళ ఉదయం వేకువజామున 4.59 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే షార్ కు శాస్ర్తవేత్తల బ్రుందం చేరుకుంది. షార్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో సి-52 నమూనాను శ్రీవారి మూలవిరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేల పూజలు నిర్వహించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు సి-52 నమూనాకు వేదాశీర్వచనం చేసారు. ఆలయ అధికారులు ఇస్రో సైంటిస్ట్ బృందానికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి... పట్టువస్త్రంతో సత్కరించారు. ఇక సోమనాథన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇదే మొదటి ప్రయోగం కావడం వివేషం.