AP YSR Rythu Bharosa: వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డాయా? చెక్ చేయండి ఇలా
AP YSR Rythu Bharosa: వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డాయా? చెక్ చేయండి ఇలా
AP YSR Rythu Bharosa Status | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి మీ అకౌంట్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు వచ్చాయా? లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా? చెక్ చేయండి ఇలా.
1. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల అకౌంట్లలోకి రూ.1,766 కోట్లు విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,766 కోట్లలో రూ.1,120 రైతు భరోసా పథకానికి సంబంధించినవి. మిగతా రూ.646 కోట్లు నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రకటించిన పెట్టుబడి రాయితీ. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. అయితే రైతుల అకౌంట్లలోకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం డబ్బులు వచ్చాయో లేదో ఎలా తెలుసుకోవాలన్న సందేహాలున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో స్టేటస్ తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. లబ్ధిదారులు ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://ysrrythubharosa.ap.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Know your RythuBharosa Status పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లబ్ధిదారులు తమ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత submit పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా మీకు డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. మీకు అన్ని అర్హతలు ఉన్నా డబ్బులు జమ కాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల సందేహాలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబర్ ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు రాకపోతే లబ్ధిదారులు 155251 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. తమకు డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఏటా రూ.7,500 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా రూ.6000 వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)