#MissionPaani : అలా తాగునీటి సమస్యను జయించిన ఆ గ్రామస్తులు..

Mission Paani : ఒకప్పుడు భూగర్భ జలాలు తక్కువ లోతులోనే లభ్యమయ్యేవి. వర్షాభావం వల్ల, అధికంగా భూగర్భ జలాలను వాడుకోవడం వలన భూగర్భ జల మట్టం రాను రాను తగ్గిపోతోంది. పాతాళ జలం ప్రమాదకరస్థాయికి పడిపోయింది. వెయ్యి అడుగుల లోతున తవ్వితే కానీ బోర్లలో నీటి చుక్క జాడ కనిపించట్లేదు. 300-400 అడుగుల కన్నా లోతు నుంచి వచ్చే నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే భారలోహాలు, రసాయనాలు ఉంటాయి.అవి తాగడానికి పనికిరావని నిపుణులు చెబుతున్నారు. దీని వలన పర్యావరణంలో మార్పులు చాలా త్వరగా వచ్చే అవకాశమున్నది. ఈ భూగర్భ జల మట్టం ప్రమాద స్థాయికి చేరక ముందే మేల్కొని భూగార్భ జల మట్టాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకోసం వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా ఎక్కడికక్కడ ఆ జలాలను ఇంకుడుగుంతల లోనికి చేర్చ గలిగితే భూగర్భ జల మట్టం పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి.