దేశవ్యాప్తంగా కేజీఎఫ్ మేనియా కుమ్మేస్తోంది. కలెక్క్షన్లో పాత రికార్డులన్నంటినీ రాఖీపై తుడిచిపెట్టేస్తున్నాడు. దీంతో హీరోగా యష్ కు ఎంతపేరొచ్చిందే.. డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సినీవర్గాల్లో ఎక్కడ ఎవరినోట విన్నా ప్రశాంత్ నీల్ పేరే వినిపిస్తోంది. గూగుల్ సెర్చ్ లోనూ ప్రశాంత్ నీల్ గురించి ఆరా తీస్తున్నారు. (Photo Credit: FaceBook)
ఐతే రీసెంట్ గా ప్రశాంత్ నీల్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కన్నడసీమలో డైరెక్టర్ గా ఉన్న ప్రశాంత్ నీల్.. ఆంధ్రప్రదేశ్ వాడే.. అందునా సీమ బిడ్డే. ప్రశాంత్ నీల్ స్వస్థలం.. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామం. (Photo Credit: FaceBook)
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డికి దగ్గరి బంధువు ప్రశాంత్ నీల్. రఘువీరారెడ్డి, ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ అన్నదమ్ముల పిల్లలు. సుభాష్ కు పెళ్లైన తర్వాత ఆయన కుటుంబం బెంగళూరులో సెటిల్ అయింది. దీంతో అక్కడే చదువుకున్న ప్రశాంత్ నీల్.. స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. (Photo Credit: FaceBook)
ఇక ప్రశాంత్ నీల్.. పేరుతోని నీల్ అంటే అతని ఇంటిపేరు నీలకంఠాపురం అంట. నీలకంఠాపురంను నీల్ గా కుదించి తన ఇంటిపేరుగా పెట్టుకున్నాడట ప్రశాంత్ నీల్. ఐతే ప్రశాంత్ నీల్ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడని తమకు తెలియని నీలకంఠాపురం వాసులు చెబుతున్నారు. స్వగ్రామం వచ్చినప్పుడు ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఉంటారని.. అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తారని ప్రశాంత్ బంధువులు చెబుతున్నారు. (Photo Credit: FaceBook)
ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ కావడంతో నీలకంఠాపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరిబిడ్డ ఇంతటి స్థాయికి ఎదగడం సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు. ఐతే నీల్ సక్సెస్ పై మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఏమంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ కు టాలీవుడ్ యాక్టర్ ఆదర్శ్ కజిన్ అవుతారట. ప్రశాంత్ ఫస్ట్ సినిమా ఉగ్రమ్ హీరో శ్రీ మురళీ కూడా నీల్ కు బంధువే. ( యష్ తో ప్రశాంత్ నీల్-File)
ప్రశాంత్ కుటుంబం బెంగళూరులోని హాయ్ లాండ్ ప్రాంతంలో ఉంటోంది. అక్కడే చదువుకున్న నీల్.. స్థానికంగా జరిగే సినిమా షూటింగులను ఆసక్తికరంగా గమనించేవాడని.. ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్ పై దృష్టిపెట్టి.. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తొలి సినిమా ఉగ్రమ్ సూపర్ హిట్ కాగా.. రెండో సినిమా కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక కేజీఎప్ చాప్టర్-2 ప్రశాంత్ ను ఇండియాలోనే పేమస్ డైరెక్టర్ల లిస్ట్ లో చేర్చింది. (Photo Credit: FaceBook)
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సలార్ లో ప్రభాస్ డ్యూయర్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కేజీఎప్ హిట్ సెలబ్రేషన్స్ లో ఉన్న ప్రశాంత్ త్వరలోనే సలార్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. (File Photo)