Vijayawada: మరో ఘనత సాధించిన విజయవాడ రైల్వే స్టేషన్
Vijayawada: మరో ఘనత సాధించిన విజయవాడ రైల్వే స్టేషన్
దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లను సుందరీకరించే పనిలో ఉంది భారతీయ రైల్వే. అంతేకాదు... ఖర్చు తగ్గించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసింది.
1. భారతదేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు సుందరంగా మారుతున్నాయి. ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్లను అలంకరిస్తోంది ఇండియన్ రైల్వేస్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను కూడా పెంచుతోంది. (image: Wikipedia)
2/ 7
2. విజయవాడ రైల్వే స్టేషన్లో రూ.60 లక్షల ఖర్చుతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. రైల్వే స్టేషన్‌లోని 4, 5 వ నెంబర్ ప్లాట్‌ఫామ్ పైన 65 కిలోవాట్ కెపాసిటీ గల సోలార్ పవర్ ప్లాంట్ ఇది. (image: Indian Railways)
3/ 7
3. ఈ సోలార్ పవర్ ప్లాంట్‌లో మొత్తం 198 సోలార్ ప్యానెల్స్ ఉపయోగించారు. ఇతర రైల్వే స్టేషన్లతో పోలిస్తే ఎక్కువ కెపాసిటీ ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిందే. (image: Indian Railways)
4/ 7
4. ఇప్పటికే విజయవాడ రైల్వే స్టేషన్ అనేక ఘనతల్ని సాధించింది. ఈ రైల్వే స్టేషన్‌కు ISO 14001: 2015 సర్టిఫికేషన్ ఉంది. (image: indiarailinfo)
5/ 7
5. రైల్వే స్టేషన్ల శుభ్రత విషయంలో థర్డ్ పార్టీ నిర్వహించిన ఆడిట్లో 7వ ర్యాంక్ సాధించింది.
6/ 7
6. ఇప్పుడు దేశంలోనే అత్యంత ఎక్కువ కెపాసిటీతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు మరో ఘనత దక్కింది. ఈ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ఏటా రూ.8.1 లక్షలు విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని అంచనా. (image: Indian Railways)
7/ 7
7. అంతేకాదు... విజయవాడ స్టేషన్లో మరింత ఎక్కువగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. (image: Indian Railways)