1. సంక్రాంతి సెలవుల్లో ఊరెళ్తున్నారా? రైలు టికెట్లు బుక్ చేశారా? రిజర్వేషన్ కన్ఫామ్ కాలేదా? రైలు టికెట్లు దొరకలేదని ప్రయాణం వాయిదా వేద్దామనుకుంటున్నారా? రైలు టికెట్లను రైలు బయల్దేరడానికి 120 రోజుల ముందు నుంచి బుక్ చేసుకోవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ రైలు బయల్దేరే రోజు, అది కూడా 30 నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేయొచ్చన్న సంగతి అతి కొద్దిమందికే తెలుసు. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతీయ రైల్వే అందిస్తున్న అద్భుతమైన అవకాశం ఇది. మీకు సంక్రాంతి సెలవుల్లో ఊరెళ్లేందుకు రైలు టికెట్లు దొరక్కపోతే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. రైలు బయల్దేరడానికి సరిగ్గా 4 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ఇందులో బెర్తులు ఏవైనా ఖాళీగా ఉంటే చూడొచ్చు. ఇది మొదటి చార్ట్ మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఏ బోగీలో ఏ సీటు ఖాళీగా ఉందో కూడా లే అవుట్ చూసి తెలుసుకోవచ్చు. మొదటి చార్ట్ ఉదయం 10.39 గంటలకే ప్రిపేర్ అయిపోయింది. మొదటి చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత బెర్తులు ఖాళీగా ఉండటంతో టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఇస్తోంది ఐఆర్సీటీసీ. ఇలాగే మీరు వెళ్లాలనుకునే రోజు కూడా సెర్చ్ చేసి చూస్తే బెర్తులు ఖాళీగా ఉంటే బుక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)