AP Weather Update: ఏపీకి మరో గండం.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్..
AP Weather Update: ఏపీకి మరో గండం.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్..
నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు వణికించాయి. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు వణికించాయి. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
వర్షాలు, వరదల ధాటికి నాలుగు జిల్లాలో లక్షలాది ఎకరాల పంటలు దెబ్బతినగా.. వేలాది ఇళ్లు నేలకూలాయి. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. వేలాది మంది ఇంకా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
ఈనేపథ్యంలో వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు మరోసారి వానగండం పొంచిఉన్నట్లు వెల్లడించింది. నాలుగు రోజుల్లో ఈ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యులేషన్ ఏర్పడినట్లు తెలిపింది. రాబోయే 4-5 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
దీని ప్రభావంతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదే సమయంలో చురుగ్గా కదలనున్న రుతుపవనాలురాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయా ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
ఇక ఇప్పటికే భారీ వర్షాల కారణంగా నాలుగు జిల్లాలో దాదాపు 8లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోగా.. 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)