AP,TS weather update: భారీ వర్ష సూచన -విశాఖ జాలర్లకు IMD హెచ్చరిక - Odishaలో యెల్లో అలర్ట్ జారీ

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అందరినీ కలవరపెడుతున్నది. ఒడిశా మొదలుకొని తమిళనాడు వరకు, ఇటు తెలంగాణపైనా దాని ప్రభావం కొనసాగుతున్నది. అరేబియా సముద్రలో ఏర్పడిన మరో అల్పపీడం కారణంగా కేరళలో వానలు దంచికొడుతున్నాయి. కర్ణాటకపైనా దాని ప్రభావం ఉంది. ఏపీలో ప్రధానంగా ఉత్తరాంధ్రను భారీ వర్షం ముంచెత్తనుందన్న అంచనాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వివరాలివి..