IMD ISSUES RAIN ALERT FOR ANDHRA PRADESH AS LOW PRESSURE FORMED IN BAY OF BENGAL FULL DETAILS HERE PRN VSP
AP Rain Alert: ఏపీకి చల్లని కబురు.. దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ముప్పు..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేసవితాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు వడగాలులతో విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావారణ శాఖ ఏపీ ప్రజలకు చల్లని కబురు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేసవితాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు వడగాలులతో విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావారణ శాఖ ఏపీ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 5
ఐఎండి సూచనల ప్రకారం ఏపికి వాయుగుండం ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 5
ఇది వాయవ్య దిశగా పయనిస్తూ రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశముండటంతో తీరప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. వెళ్లిన వారు తిరిగొచ్చేయాలని సూచించింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 5
ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా తెలుగురాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, గుంటూరుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 5
మరోవైపు మే నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావారణ శాఖ తెలిపింది. వర్షాలు కూడా ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. ఐతే వేసవిలో ఈదురుగాలులతో కూడిన వానలు ఎక్కువగా కురుస్తుంటాయి. తాజాగా వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ చల్లబడే అవకాశముంది. (ప్రతీకాత్మకచిత్రం)