[caption id="attachment_769580" align="alignnone" width="875"] నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఎగువన ఉన్న వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా.. సుమారు 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేస్తున్నారు. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నాయుడుపేట వద్ద బ్రిడ్జిపైన నది ప్రవహిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని, ప్రతిఒక్కరి సమస్య తెలుసుకొని వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.