AP Cyclone Alert: ఏపీకి తుఫాన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
AP Cyclone Alert: ఏపీకి తుఫాన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
మండు వేసవిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు తుఫాన్ ముప్పు (Cyclone Alert) పొంచి ఉంది. ఓ వైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు వానలు దంచికొట్టనున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
మండు వేసవిలో ఆంధ్రప్రదేశ్ కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఓ వైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు వానలు దంచికొట్టనున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలుతున్నాయి. పిడుగులతో జనం హడలిపోతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
ఇదిలా ఉంటే ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా ఇవాళ్టికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
వాయుగుండం ఈ నెల ఎనిమిది నాటికి తూర్పు మధ్యబంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు. తుపాను ఈనెల 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర ఒడిసాల తీరాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కానుంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
అల్పపీడనంతో పాటు ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా శనివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారలాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
ఈ నెల పదిన ఉత్తరాంధ్ర-ఒడిశా సరిహద్దు జిల్లాలలో చెదురు మదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో పరిస్థితుల దృష్ట్యా మత్య్సకారులు వెటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
మరోవైపు మే నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావారణ శాఖ తెలిపింది. వర్షాలు కూడా ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. ఐతే వేసవిలో ఈదురుగాలులతో కూడిన వానలు ఎక్కువగా కురుస్తుంటాయి. తాజాగా వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ చల్లబడే అవకాశముంది. (ప్రతీకాత్మకచిత్రం)