ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా లో టమాట పంట అధికంగా పండుతోంది. ప్రస్తుతం రైతుల చేతికి టమాటా పంట వచ్చింది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి ఉండడంతో ఇప్పుడు స్థానిక టమాట పంటకు ధరలు వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదు. దీంతో స్థానిక టమాట పంటకు ధరలు లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.