సాధారణంగా మార్కెట్లో టమాటా రేటు (Tomato Price Today) చెబితే జనం హడలిపోవాల్సిదే. నెలనెల టమాటా రేట్లు పెరుగుతూ వినియోగదారుడికి చుక్కలు చూపిస్తుంటాయి. వరదలు వచ్చిన సమయంలో టమాటా కొనాలంటే పర్స్ ఖాళీ అయ్యే పరిస్థితి. గత ఏడాది నవంబర్ తర్వాత టమాటా రేట్లు పెట్రోల్ తో పోటీ పడ్డాయి. ఆ తర్వాత ధరలు దిగొచ్చినా మళ్లీ పెరిగాయి.
ఇక ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ గా పేనున్న మదనపల్లి మార్కెట్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రెండు నెలల క్రితం వరకు టమాటాలకు మంచి ధరే వచ్చింది. ఇప్పుడు కనీసం కొనేవారు కూడా లేకపోవడంతో సరుకుంతా మార్కెట్లోనే కళ్లిపోతోంది. గత నాలుగు రోజులుగా టమాటా ధరలు బాగా పడిపోయాయి. పంటను మార్కెట్ కు తీసుకొచ్చిన రైతులు.. ఎంతోకొంతకు కొనుగోలు చేయాలని వ్యాపారాలను వేడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శనివారం 30 కిలోల మొదటి రకం టమాటా బాక్స్ కేవలం రూ.150 పలికింది. రెండో రకం మరీ దారుమంగా రూ.70 పలికింది. దీంతో రైతుకు రవాణా ఖర్చులు కూడా రావడం లేద. మదనపల్లె మార్కెట్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి టమాటాలు వస్తుంటాయి. దీంతో పాటు భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణాకు ఆటంకాలు ఏర్పడుతుండటంతో మార్కెట్లో కొనేందుకు ఆసక్తి చూపడం లేదు.