ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై వివాద కొనసాగుతోంది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేయడంతో పాతపద్ధతిలోనే టికెట్లను విక్రయించేలా ఆదేశిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. (ప్రతీకాత్మకచిత్రం(
ఇక హైకోర్టు జీవో నెం.35ను కొట్టివేయడంతో పాతపద్ధతిలోనే టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం కల్పించినట్లయింది. ఐతే తీర్పు సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. థియేటర్ల యాజమాన్యాలు టికెట్ రేట్లను పెంచాలనుకుంటే సదరు వివరాలను జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ధలలపై జేసీనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం(
ప్రభుత్వ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేయడంతో శుక్రవారం విడుదల కాబోతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా టికెట్ల విషయంలో సందిగ్ధత వీడిపోయింది. పుష్ప టికెట్ల ధరలను పాతపద్ధతిలోనే విక్రయించుకునే వెసులుబాటు కలిగింది. ఐతే టికెట్ల ధరల వివరాలను మాత్రం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం(