ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi Scheme). ఈ పథకం కింద ప్రతి ఏడాది జనవరిలో నగదు జమ చేస్తున్న ప్రభుత్వం.. ఈ ఏడాది జూన్ లో ఇవ్వనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే వివరాలు సేకరించే ప్రక్రియు మొదలుపెట్టింది. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ద్వారా వివరాలు సేకరించి పిల్లలు చదివే పాఠశాలల లాగిన్ తో సరిపోల్చుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఐతే కొంతమంది బ్యాంక్ ఎకౌంట్లు ఆధార్ కు లింక్ కాకపోవడం, రెండు మూడు ఎకౌంట్లు ఉండటం, అమ్మఒడి నమోదు ప్రక్రియలో పొరబాట్లు చేయడంతో డబ్బులు పడటం లేదు. వీరిలో కొందరు స్కూల్ యాజమాన్యాలపై గొడవలకు దిగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఐతే బ్యాంక్ ఎకౌంట్లకు సంబంధించిన అప్ డేషన్ ప్రభుత్వం వివరించింది. (ప్రతీకాత్మకచిత్రం)
గత రెండేళ్లుగా అమ్మఒడి పథకం డబ్బులు లబ్ధిదారులు ఇచ్చిన వివరాల అధారంగా స్కూల్ లాగిన్ లో ఎంటర్ చేస్తే సదరు ఎకౌంట్లోనే నగదు జమయ్యేవి. కానీ ఈ సారి మాత్రం అలా కాదు. NPCI అంటే NATIONAL PAYMENT CORPORATION OF INDIAకి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మఒడి డబ్బులు పడతాయి. NPCI లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో నమోదు చేయాలి. ఇది కేవలం అమ్మఒడి అనే కాదు ప్రభుత్వం నుండి రావాల్సిన ఎలాంటి నగదు అయినా NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే జమవుతాయి. (ప్రతీకాత్మకచిత్రం)
బ్యాంకు అకౌంట్ NPCI కి LINK చేయడమంటే ఆధార్ తో లింక్ చేయడమే..! ఆధార్ తో లింక్ చేసిన ప్రతి ఒక్కరి అకౌంట్ ఇప్పటికే వారి ప్రమేయం లేకుండానే NPCI కి LINK చేసి ఉంటుంది. ఐతే ఒక వ్యక్తికి రెండు అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCIకి లింక్ అయి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏ అకౌంట్ NPCI కి లింక్ అయి ఉంది, దానినే స్కూల్లో ఇచ్చామా లేక వేరేది ఇచ్చామా అనేది ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలి. రెండు ఒకటే అయితే సరే అమ్మఒడి డబ్బులు వస్తాయి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు. రెండు ఒకటే ఉండేలా అటు బ్యాంకులో లేదా ఇటు స్కూల్లో అయినా మార్చుకోవాలసి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఐతే లబ్ధిదారునికి మూడు బ్యాంకులలో అకౌంట్లు ఉంటే మాత్రం NPCIకి లింక్ చేసిన ఎకౌంట్ నెంబర్ను స్కూల్లో ఇవ్వాలి. ఉదాహరణకు 1.UNION BANK, 2.SBI, 3.BANK OF INDIA అనుకుంటే.. వీటిలో ఏది NPCIకి లింక్ అయి ఉందో అని CHECK చేస్తే SBI చూపిస్తుంది.., కానీ స్కూల్ లో BANK OF INDIA ఇచ్చి ఉంటే. ఇక్కడ సమస్య వస్తుంది. BANK OF INDIAలో డబ్బులు పడవు, SBI లో మాత్రమే పడతాయి. రెండేళ్లుగా BANK OF INDIAలోనే డబ్బులు జమైనప్పటికీ ఈసారి పడవు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇలాంటి సమయంలో లబ్ధిదారులకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులో మొదటిది SBI అకౌంట్ వాడుకలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎకౌంట్ INACTIVEలో ఉంటే ACTIVE చేయించాలి. అలాగే స్కూల్లో BANK OF INDIAకి బదులుగా SBI అకౌంట్ వివరాలు ఇచ్చి BANK OF INDIA వివరాలు తీసేసి SBI అకౌంట్ వివరాలను ఎన్ రోల్ చేయించాలి. (ప్రతీకాత్మకచిత్రం)