ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. వైఎస్సార్ రైతుభరోసా (YSR Rythu Bharosa) కింద అర్హులైన ప్రతి రైతుకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆర్ధిక సంవత్సరానికి సబంధించి తొలి విడద నగదు జమ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈనెల 15న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
వెబ్ ల్యాండ్ లోని రికార్డుల ఆధారంగాఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీభూమి సాగుదారులు, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సాగుదారులను గుర్తించి మొదటి విడతగా ఈనెల 15న రూ.7,500, రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రభుత్వం గత రెండేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసందే. 2019–20లో 46.69 లక్షల మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52.38 లక్షల మంది రైతులకు రూ.7,016.59 కోట్ల సాయం అందించారు. 2022–23లో 48.77 లక్షల అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ధిచేకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి మొదటి విడతగా ఈ నెల 15న రూ.3,657.87 కోట్ల సాయం అందించబోతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)