Papikondalu Boat Services: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అందమైన పర్యాటక ప్రాంతాలు (Tourist Places in Andhra Pradesh) చాలానే ఉన్నాయి. అందమైన బీచ్ లు, పచ్చనైన వనాలు, నదీపరివాహక ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. అందులో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. ఐతే కొంతకాలంగా పాపికొండలు యాత్ర (Papikondalu Tour) నిలిచిపోయింది. ఐతే పాపికొండల నడుమ గోదావరి నదిలో బోటు షికారు (Boating in Godavari River) కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త.
పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. నవంబర్ 7వ తేదీ అంటే రేపటి నుంచి పాపికొండలు బోట్ యాత్ర ప్రారంభమవుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాపికొండలకు బోటింగ్ కార్యకలాపాలు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తూర్పుగోదావరి కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
బోట్ సర్వీసుల ప్రారంభంపై రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో టూరిజం, పోలీసులు అధికారులతో కలెక్టర్ హరి కిరణ్ సమావేశం నిర్వహించారు. బోటు ఆపరేటర్లు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ టూర్ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనల గురించి కలెక్టర్ వివరించారు.
తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. రేపటినుంచి బోటు సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు గండి పోచమ్మ ఆలయం బోట్ పోయింట్ వద్ద ట్రయిల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజన వసతితో కలపి టికెట్ ధరను రూ.1,250 గా ప్రభుత్వం అంతకుమందు నిర్ణయం తీసుకుంది. అయితే కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది.
గతంలో పెద్దలకు రూ.750 వరకూ తీసుకునేవారు. రాజమహేంద్రవరం నుంచి తీసుకుని వెళ్లి బోటు ఎక్కించి భోజనం, స్నాక్స్ పెట్టి సాయంకాలం తీసుకొచ్చేవారు. ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్ పూర్తి కావడంతో ఇక బోటింగ్ గండిపోచమ్మ గుడి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములు వరదలో మునిగిపోవడంతో వాటిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు 500 రూపాయలు పెంచింది ప్రభుత్వం..
కొత్త రేట్లతో రేపటి నుంచి బోటు షికారు ప్రారంభం కానుంది. టూరిజం బోట్లతోపాటు, ప్రైవేట్ బోట్లు కూడా షికారు చేయనున్నాయి. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత పాపికొండల బోటు యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. సుమారు రెండేళ్ల తర్వాత ఈ బోటు షికారు ప్రారంభం కానుంది. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల పాపికొండలలో గతంలో కంటే గోదారి లోతు పెరిగింది.
బోటు షికారు వల్ల మళ్లీ వీటి మీద ఆధారపడిన వారికి పని దొరుకుతుంది. లాంచీలను పూర్తిగా నిషేధించి బోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత పాపికొండలు, పేరంటాలపల్లి విహారయాత్ర ప్రారంభమవుతోంది. ఇంతకాలం బోట్లు నిలిచిపోవడంతో చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి.. ఇప్పుడు మళ్లీ విహార యాత్ర ప్రారంభమవుతుండడంతో ఉపాధి కోల్పోయినవారంత ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తమకు పని దొరికనందుకు..
బోటు షికారు వల్ల మళ్లీ వీటి మీద ఆధారపడిన వారికి పని దొరుకుతుంది. లాంచీలను పూర్తిగా నిషేధించి బోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత పాపికొండలు, పేరంటాలపల్లి విహారయాత్ర ప్రారంభమవుతోంది. ఇంతకాలం బోట్లు నిలిచిపోవడంతో చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి.. ఇప్పుడు మళ్లీ విహార యాత్ర ప్రారంభమవుతుండడంతో ఉపాధి కోల్పోయినవారంత ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తమకు పని దొరికనందుకు..
ఉదయం 7.30 గంటల సమయంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గాన పురోషోత్తపట్నం, పట్టిసీమ, పోలవరం తీరానికి తీసుకెళ్తారు.
అక్కడి నుంచి బోట్ల ద్వారా దేవీపట్నం, పేరంటాళ్లపల్లి, పాపికొండలు, భద్రాచలం వంటి ప్రాంతాలకు తీసుకెళ్తారు. రెండు రోజుల టూర్ కు ఎంపిక చేసిన చోట నైట్ స్టే కల్పిస్తారు. టూర్ పూర్తైన తర్వాత మళ్లీ రాజమండ్రిలోనే డ్రాప్ చేస్తారు.