విశాఖపట్నం జిల్లా, వైజాగ్ వార్తలు, విశాఖపట్నం వార్తలు, గులాబ్ తుఫాన్ వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, తలుగు వార్తలు, ఆంధ్రా వార్తలు," width="1200" height="800" /> ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. చెరువులు పొంగి ఊళ్లకు ఊళ్లనే ముంచేశాయి. దీంతో భారీ ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించాయి. ఇళ్లు నీటమునగడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. (ప్రతీకాత్మకచిత్రం)
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. (ప్రతీకాత్మకచిత్రం)