ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) ను భారీ వర్షాల (Heavy Rains) ముప్పు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఈ రాత్రికి అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ (Cyclone) గా మారి ఏపీ తీరాన్ని తాకే అవకాశముందని హెచ్చరించింది. (ప్రతీకాత్మకచిత్రం)
దీని ప్రభావంతో డిసెంబర్ 2 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో భీ వర్షాలు కురసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా డిసెంబర్ 3, 5 తేదీల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)