ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎండలు మండిపోతున్నాయి. అలా ఇలా కాదు.. బయటికెళ్లే సూర్యుడు మోతెక్కిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. రాత్రైనా వేడిగాలుల తీవ్రత తగ్గడం లేదు. రాత్రిళ్లు కూడా 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ఇప్పటికే కోస్తాంధ్ర నిప్పులు కొలిమిని తలపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 86 మండలాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. 424 మండలాల్లో ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉంటే శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలుగా ఉంటే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)
గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా మోగులూరులో 45.24 డిగ్రీలు, తూర్పు గోదావరి జిల్లా 44.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 44.6 డిగ్రీలు, ఏలూరు జిల్లా టి.నరసాపురంలో 44.65 డిగ్రీలు, అల్లూరు సీతారామరాజు,శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (Photo Credit: APWeatherman Twitter)
శుక్రవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, కాకిడాన జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, ఎన్టార్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని.. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. (Photo Credit: APWeatherman Twitter)
ఇక శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 45-47 డిగ్రీలు, పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో 43-45 డిగ్రీల మద్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 83 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని, 157 మండలాలపై వడగాలుల ప్రభావం ఉండనుంది. అలాగే శనివారం 68 మండలాల్లోతీవ్రవడగాలులు, 147 మండలాల్లో వడగాలలు ప్రభావం అధికంగా ఉంటుందని.. 540 మండలాల్లో ఉక్కపోత ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. (ప్రతీకాత్మకచిత్రం)