ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా పరిచయం లేనివారు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు. చాటింగ్ ద్వారానే ఇష్టాఇష్టాలు తెలుసుకోవడం, ఫోటోలు, వీడియోలు పంచుకోవడం వంటి చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
ఐతే కొందరు ఇలాంటి స్నేహాలను బ్లాక్ మెయిలింగ్ చేయడానికి వినియోగించుకున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన యువతి ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఆమె నాలుగు నెలలుగా ఇన్ స్టాగ్రామ్ వాడుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
నాలుగు నెలల క్రితం రామ్ అనే యువకుడు అతని స్నేహితుడు కలిసి యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా వెంటనే అంగీకరించింది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
చాటింగ్ లో భాగంగా క్లోజ్ గా మాట్లాడిన రామ్.. డబ్బులు అవసరముందంటూ ఆమె దగ్గర విడతల వారీగా రూ.85 వేలు తీసుకున్నాడు. విద్యార్థిని ఇంట్లోవాళ్లకు తెలియకుండా అతడికి డబ్బులిచ్చింది. మరో యువకుడు కూడా రూ.21వేలు తీసుకున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
ఐతే ఇంకా డబ్బులు కావాలని ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. యువతి ఇచ్చేది లేదని చెప్పడంతో ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
ఇటీవల వేధింపులు ఎక్కువవడంతో జరిగిన విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)