వివరాల్లోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని కప్పలతండాకు చెందిన బాలాజీ నాయక్ కు బుజ్జి అనే మహిళతో కొన్నేళ్లక్రితం పెళ్లైంది. బాలాజీనాయక్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. భార్య బుజ్జి అదే గ్రామానికి చెందిన పరశురాముడు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. (ఫ్రతీకాత్మకచిత్రం)
దీనికి అంగీకరించిన పరశురాం తనకు పరిచయస్తుడైన గుంటూరు జిల్లాకు చెందిన పవన్ నాయక్ తో విషయం చెప్పుడు.. అతడు మరో ముగ్గురితో కలిసి బాలాజీని చంపడానికి రూ.90వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన ఇంతడ్ని ఇంటివద్దే మర్డర్ చేయడానికి ప్లాన్ వేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. (ఫ్రతీకాత్మకచిత్రం)
దానిని సహజమరణమని నమ్మించేందుకు ఇంట్లో పడుకోబెట్టి వెళ్లిపోయారు. ఐతే భర్త సహజంగానే మరణించాడని బుజ్జీ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ మృతుడి తమ్ముడు నెహ్రూ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బుజ్జిని అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించారు. దీంతో ప్రియుడితో కలిసి చేసిన ఘోరాన్ని బయటపెట్టింది. (ఫ్రతీకాత్మకచిత్రం)