మిగిలిన కొద్ది పాటి పంట చేతికి వచ్చే సమయానికి వర్షం దెబ్బతీస్తుందని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాపట్ల జిల్లా కొల్లూరులో ఇటుకల బట్టీలు వర్షంలో తడిసి పూర్తిగా దెబ్బతిన్నాయి. పల్నాడు జిల్లాలో మిర్చితో పాటు మొక్కజొన్న, మినుము, శనగ పంటలు వర్షం దెబ్బకి పూర్తిగా దెబ్బతిన్నాయి.