Corona Third Wave: ఏపీలో థర్డ్ వేవ్ టెన్షన్...? పిల్లలకు కరోనా పాజిటివ్.. ఎక్కడంటే..!
Corona Third Wave: ఏపీలో థర్డ్ వేవ్ టెన్షన్...? పిల్లలకు కరోనా పాజిటివ్.. ఎక్కడంటే..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)లో లక్షలాది మందికి వైరస్ సోకింది. ఇందులో వేలాది మంది మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ లో లక్షలాది మందికి వైరస్ సోకింది. ఇందులో వేలాది మంది మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
ఇదిలా ఉంటే త్వరలో పాఠశాలలు ప్రారంభించాలని చూస్తున్న తరుణంలో చిన్నపిల్లలకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో రెండు గ్రామాల్లో ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్ గా తేలింది. కంకటపాలెంలో 15ఏళ్ల బాలుడికి, రామ్ నగర్ లో తొమ్మిదేళ్ల బాలుడుకి, వెదుళ్లపల్లిలో ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
వీరిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు వైరస్ సోకి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు వెల్లడించారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
గత ఏడాది పాఠశాలలు ప్రారంభించిన సమయంలో కూడా కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు వైరస్ సోకింది. ఐతే ఎవరికీ పెద్దగా సమస్యలు రాకపోవడం, పిల్లల్లో మరణాలు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
ఐతే థర్డ్ వేవ్ లో చిన్నపిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణలు హెచ్చరిస్తున్న తరుణంలో తాజాగా కేసులు వెలుగు చూడటంతో తల్లిదండ్రుల్లో కలవరం నెలకొంది. (ప్రతీకాత్మకచిత్రం)