GUNTUR SEMI LOCKDOWN IMPOSED IN SOME VILLAGES OF GUNTUR DISTRICT AS CORONA POSITIVITY RATE INCREASING FULL DETAILS HERE PRN GNT
AP Lockdown: ఏపీలో మళ్లీ లాక్ డౌన్... మధ్యాహ్నం 2గంటల తర్వాత అంతా బంద్... ఎక్కడంటే..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు (Corona Positive Cases) తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ (Curfew) ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. కానీ...
ఆంధ్రప్రదేశ్ లో కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రమే సాయంత్రం 6గంటల తర్వాత కర్ఫ్ఫ్యూ అమలు చేస్తుండగా.. మిగిలిన జిల్లాల్లో రాత్రి 10 గంటల వరకు సడలిపులిచ్చారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
ఐతే రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో మాత్రం పాజిటివిటీ రేటు అధికంగా ఉండటంతో మళ్లీ లాక్ డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
ముఖ్యంగా గుంటూరు జిల్లాల్లోని పల్నాడు ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో కరోనా విజృంభిస్తోంది. దీంతో గురజాల, పులిపాడు, కొండమోడు గ్రామాల్లో అధికారులు సెమీ లాక్ డౌన్ విధించారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే వ్యాపార సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గురజాల, పులిపాడ గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
ఇక నియోజకవర్గ కేంద్రమైన చిలకలూరిపేట పట్టణంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇక్కడ కూడా మధ్యాహ్నం 2గంటల తర్వాత వ్యాపార సంస్థలు మూసేయాలని, ప్రజలు బయటకి రావొద్దంటూ అధికారులు అదేశాలు జారీ చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇవే ఆంక్షలు అమలవుతాయని.. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. (ప్రతీకాత్మకచిత్రం)