GUNTUR POLICE OFFICE ARRANGED BIRTHDAY PARTY BREAKS COVID RULES IN GUNTUR CITY OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Andhra Pradesh: బర్త్ డే పార్టీ పేరుతో అర్ధరాత్రి అమ్మాయిలతో... సీ.ఐ సమక్షంలోనే రచ్చరచ్చ
పోలీసులంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ వాళ్లే రూల్స్ బ్రేక్ చేసి జనాలపై పడితే బాగోదు. అలాంటి ఓ సీఐ.. తన సమక్షంలో అమ్మాయిలతో చిందులేస్తున్నా పట్టించుకోకుండా పార్టీలో మునిగితేలాడు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్నిజిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం టెన్షన్ పెడుతోంది. ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు.
2/ 6
ఇలాంటి సమయంలో బాధ్యత మరచిన ఓ పోలీస్.. నిబంధలకు విరుద్ధంగా జరిగిన పార్టీకి అటెండ్ అయ్యాడు. అంతేకాదు అమ్మాయిలు చిందులేస్తుంటే దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేశాడు.
3/ 6
గుంటూరులోని లక్ష్మీపురంలో సీ.ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అర్ధరాత్రి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు.
4/ 6
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా చూస్తూ ఉండిపోయారే తప్ప. వారిని వారించలేదు.
5/ 6
నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు చేయడమే కాకుండా అక్కడ మందు, అమ్మాయిలతో డాన్సులు, ఇతర వ్యవహారాలు కూడా ఏర్పాటు చేశారు.
6/ 6
సమాచారమందుకున్న పోలీసులు పట్టాభిపురం సీఐగా పనిచేస్తూ ప్రస్తుతం వీఆర్ లో ఉన్న వెంకటేశ్వర్లును వదిలేసి.. పార్టీకి వచ్చిన 25 మందిపై కేసు నమోదు చేశారు. సీఐ ఉన్నారన్న ధైర్యంతో తామంతా పార్టీకి వస్తే ఆయన్ను వదిలేది తమను అరెస్ట్ చేయడమేంటని అక్కడికొచ్చిన వాళ్లు లబోదిబోమంటున్నారు.