GUNTUR OLD LOVERS ATTEMPTED TO SUICIDE AT SURYALANKA BEACH IN GUNTUR DISTRICT FULL DETAILS HERE PRN
ఆషాఢమని పుట్టింటికి వచ్చిన నవ వధువు.. ఇంతలో మాజీ ప్రియుడు కలిశాడు.. ఆ తర్వాత...
కులాలు, మతాలు, ఆర్ధిక స్థితిగతులు అడ్డంకులుగా మారి ప్రేమించిన వారిని కాకుండా పెద్దలు చూసిన వారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. అలా ప్రేమ విఫలమైన ఓ జంట..
ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమకు పెళ్లితో ముగింపు పలకడం కొంచెం అరుదనే చెప్పాలి. అతికొద్దిపమందే ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లి ఒక్కటవుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
కొంతమందికి కులాలు, మతాలు, ఆర్ధిక స్థితిగతులు అడ్డంకులుగా మారి ప్రేమించిన వారిని కాకుండా ఇతరులను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలా ప్రేమ విఫలమైన ఓ జంట కఠిన నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబొట్లవారి పాలెంకు చెందిన ఓ యువతి, శ్రీకాంత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఐతే విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు నెలరోజుల క్రితం ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్లిచేశారు. ఆషాఢమాసం కోవడం పుట్టింటికి వచ్చిన యువతి నెలరోజులుగా అక్కడే ఉంటోంది. ప్రతీకాత్మకచిత్రం
5/ 6
రెండు రోజుల్లో తిరిగి అత్తారింటికి వెళ్లాల్సి ఉండగా.. ఇంతలో మాజీ ప్రియుడు శ్రీకాంత్ కనిపించారు. ఇద్దరూ కలిసి సూర్యలంక బీచ్ కు వెళ్లారు. అక్కడ కాసేపు మాట్లాడకున్న ఇద్దరూ ఇక కలిసి బ్రతకలేమన్న మనస్తాపంతో పరుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వాళ్లిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)