GUNTUR OFFICIALS IMPOSED SEMI LOCKDOWN IN GUNTUR CITY AND SATHENAPALLI MANDAL OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
AP Lockdown: ఏపీలో మళ్లీ తప్పని లాక్ డౌన్.. మధ్యాహ్నం 2గంటల తర్వాత అంతా బంద్.. ఎక్కడంటే..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇప్పుడిప్పుడే కరోనా పాజిటివ్ కేసుల (Corona Positive Cases) సంఖ్య తగ్గుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. కానీ మళ్లీ లాక్ డౌన్...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సడలింపులిచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఐతే కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్ని చోట్ల పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రజలు మాస్కులు లేకుండా బయట తిరుగుతుండటం, భౌతిక దూరం పాటించకపోవడంతో కొవిడ్ విజృంభిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
దీంతో మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు పాక్షిక లాక్ డౌన్ విధించారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో పాక్షిక లాక్ డౌన్ విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎవరూ బయటకురావొద్దని ప్రకటించారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
ఇక సత్తెనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొవిడ్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ విధించక తప్పలేదు.
6/ 7
పాకాలపాడు, భట్లూరు, గుడిపూడి, కందులవారిపాలెం గ్రామాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉండటంతో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు తహసీల్దార్ ఎస్వీ రమణ తెలిపారు.
7/ 7
ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ దుకాణాలు రాకావలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.