ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ వ్యక్తి ఏకంగా 10కేజీల బంగారంతో పరారయ్యాడు. (ప్రతీకాత్మకచిత్రం) ఆభరణాలు తయారుచేసేందుకు వ్యాపారులు ఓ వ్యక్తికి బంగారం ఇచ్చారు. దీన్ని అదునుగా తీసుకున్న వ్యక్తి బంగారంతో ఉడాయించినట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం) పరారైన వ్యక్తి దిలీప్ కుమార్ గా గుర్తించారు. దీనిపై 9 మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (దిలీప్ ఫైల్ పోటో) బంగారం బ్యాగు చోరీకి గురైనట్లు నిందితుడు దిలీప్ తన ఇంట్లో లేఖ రాసిపెట్టి పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం) విజయవాడ బస్టాండులో బంగారం బ్యాగు పోయిందని దిలీప్ ఆ లేఖలో పేర్కొన్నాడు. (ప్రతీకాత్మకచిత్రం) కేసు నమోదు చేసుకున్న పోలీసులు దిలీప్ కోసం గాలిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)