ఇదిలా ఉంటే ఆదివారం అర్ధరాత్రి డేవిడ్ రాజు.. నాగమణిని కలిసేందుకు గుంటూరు నుంచి మందడం వచ్చాడు. ఇద్దరి మధ్య డ్వాక్రా డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన డేవిడ్ రాజు.. నాగమణి మెడకు టవల్ బిగించి హత్య చేశాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె మృతదేహాన్ని ఫ్యాన్ కు వేలాడదీశాడు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇటీవల ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనేచోటు చేసుకుంది. భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ.. తమ సుఖానికి అడ్డొస్తోందని 15ఏళ్ల కుమార్తెను హత్య చేయించింది. అంతేకాదు దగ్గరుండి మృతదేహాన్ని దహనం చేయించింది. చేసిన పాపం ఊరికే ఉంటుందా..? వారం రోజుల్లోనే ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయింది. (ప్రతీకాత్మకచిత్రం)