కొందరు కామాంధులు ప్రేమ పేరుతో చేసే మోసాలకు అమాయకులు బలవుతుంటారు. అలాంటి వారి మాయలో పడి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
ఓ నయవంచకుడు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకోవడమే కాకుండా.. ఆమె అక్కకు తాళికట్టాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బాలిక రెండేళ్ల క్రితం చేబ్రోలులోని తమ బంధువల ఇంటికి వచ్చింది. అక్కడే ఉంటున్న వేములపల్లి జోష్ బాబు అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసి బాలిక కుటుంబ సభ్యులకు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు డబ్బులివ్వకుంటే ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించి వారి వద్ద నుంచి రూ.3.30 లక్షలు వసూలు చేశాడు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
ఇదిలా ఉండే బాలిక అక్కను ప్రేమ పేరుతో మభ్యపెట్టి ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
దీంతో జోష్ బాబుపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పొన్నూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)