ఆ తరువాత కొన్నాళ్ళకు తన ఇలవేల్పయిన చన్నుడి గుడిని బ్రహ్మనాయడు ఈ ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేసాడు .ఇప్పటికి పిలిస్తే పలికే దేవుడిగా పలనాటి ప్రాంత ప్రజల కొంగుబంగారంగా లక్ష్మి చెన్నకేశవ స్వామిని భావిస్తారు.స్వామివారిని దర్శించగానే సమస్త పాపలు హరించి పోతాయనే దానికి చారిత్రాత్మిక నిదర్శనాలు ఉన్నాయి.
స్వామి వారి రథోత్సవం కోసం 1879లోనే 10 వేల రూపాయిల వ్యయంతో రథావన్ని చేయించారు చెన్నకేశవుని మహాభక్తుడు శ్రీ కంచనపల్లి నారాయణ పంతులు. స్వామి వారి రథం కోసం అటవీ ప్రాంతంలో కలప సేకరించినందుకు అలనాటి బ్రిటీష్ అధికారులు నారాయణరావు పంతులుపై కేసు పెట్టగా సంబందిత అధికారికి చెన్నకేశవ స్వామి వారు కలలో కనిపించి తనకు అత్యంత ప్రీతి పాత్రుడయిన భక్తుడని తన కోసం రథం చేయించాటనికి కలప తీసుకున్నారని వదిలివేయమని చెప్పగా పంతులుపై కేసు ఉపసంహరించారట.
అంతటి మహానుభావులు చేయించిన రధం మీద ప్రతి సంవత్సరం చెన్నుడు 142 సంవత్సరాలు లక్షలాది భక్తులకు పురవీధుల్లో దర్శనం ఇస్తున్నారు. ప్రస్తుతం నారాయణ రావు పంతులు మనవడు లక్ష్మీ చెన్నకేశవరావు, వారి కుమారుడు జగన్నాధ చక్రధారి ప్రతి సంవత్సరం రథోత్సవం రోజు తొలిపూజ చేయటం ఆనవాయితీ, మాచర్లలో అంగరంగా వైభవంగా జరిగే చెన్నుని రథోత్సవానికి వేలాదిమంది తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.