కరోనా ప్రభావంతో ప్రభుత్వం పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి సంబందించి 2021 ఏప్రిల్ మాసంలో రూ.671.03 కోట్లను, రెండో త్రైమాసికానికి సంబంధించి జూలై మాసంలో రూ.693.27 కోట్లను, మూడో త్రైమాసికానికి సంబంధించి నవంబరు మాసంలో రూ.683.13 కోట్లను జగనన్న విద్యా దీవెన పథకం క్రింద ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
నాల్గో త్రైమాసికానికి సంబందించి అసెంబ్లీ సమావేశాలు అయిన తదుపరి ఈ నెలలోనే విడుల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మార్చిలో ఒక సారి, ఏప్రిల్లో మరోసారి జగనన్న విద్యాదీవెన డబ్బులు లబ్దిదారుల ఖాతాల్లో పడనున్నాయి. అంటే వరుసగా రెండు నెలల్లో రెండుసార్లు జగనన్న విద్యాదీవెన డబ్బులు పడతాయి.