ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు నెలవు పల్లెటూర్లు. ఐతే విద్య వ్యాపార ఉద్యోగాల కోసం ప్రపంచంలో నలుమూలలకు ఊళ్ల నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో ఉమ్మడి కుటుంబాలు సినిమాలకే పరిమితయిపోయిన పరిస్థితి. సంక్రాంతిని పెద్దల పండుగ అంటారు. ఎక్కడెక్కడో ఉండేవాళ్లంతా సొంత గ్రామాలకు వచ్చి తమ పిల్లలకు, వారి బంధువులకు వారి వారసత్వాలను తెలియచేస్తుంటారు.