Andhra Pradesh: ఒకే విడతలో మూడు దూడలు.. గోమాత ఘనత.. వరల్డ్ రికార్డ్ ఎంతో తెలుసా..?

ఆవు ఈనిందంటే ఆ రైతు ఎంతో ఆనందిస్తాడు. బుజ్జి దూడను చూసి మురిసిపోతాడు. కానీ ఓ గోమాత తన యజమానికి సింగిల్ కాదు డబుల్ కాదు ఏకంగా త్రిపుల్ ధమాకా ఇచ్చింది. ఒకే విడతలో మూడు దూడలకు జన్మనిచ్చింది. మూడు దూడలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి.