అమరావతి సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (SLBC) 220 వ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నారు ఆయన. ఈసమావేశంలో ప్రధానంగా 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక(ఎసిపి)అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి,వివిధ ఇండికేటర్ల వారీ సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకింగ్ సెక్టార్ కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందుకే రైతులకు వ్యవసాయ పంట రుణాలు,ముఖ్యంగా కౌలు రైతులకు రుణాలు అందించుటలో బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేశారు.
ఇకపై ఎంఎస్ఎంఇ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అందుకే ఆరంగంలో కూడా బ్యాంకులు తమవంతు తోడ్పాటును అందించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరారు. అలాగే టిడ్కో గృహాలు,ఇతర గృహనిర్మాణ పధకాల లబ్దిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు.
నవంబరు మొదటివారం నుంచి కొనుగోళ్లు చేయడానికి అన్ని రకాలుగా పరిస్థితులను సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకోసం 3,423 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలతో సహా వీటన్నింటినీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని వివరణ ఇచ్చారు.